logo

36 గంటల్లో ‘ప్రీకాస్ట్‌’ వరద కాలువలు

తాజాగా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు కొలత్తూరులో ఏకంగా 36 గంటలు పనిచేసి వరద కాలువల్ని పూర్తిచేశారు. ముందే తయారుచేసిన కాంక్రీట్‌ సిమెంట్‌ బాక్స్‌లను తీసుకొచ్చి ఈ పనులు చేపట్టారు.

Published : 04 Oct 2022 04:10 IST

కార్మికులకు సూచనలిస్తున్న ఇంజినీర్లు


ప్రీకాస్ట్‌ సిమెంటు బాక్సులను కాలువలో ఉంచుతున్న దృశ్యం

ఈనాడు-చెన్నై: తాజాగా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు కొలత్తూరులో ఏకంగా 36 గంటలు పనిచేసి వరద కాలువల్ని పూర్తిచేశారు. ముందే తయారుచేసిన కాంక్రీట్‌ సిమెంట్‌ బాక్స్‌లను తీసుకొచ్చి ఈ పనులు చేపట్టారు. పూంపుహార్‌ నగర్‌ నుంచి వెలవన్‌ నగర్‌ పేపర్‌ మిల్స్‌ రోడ్‌ మధ్యలో 10 మీట్లర మేర కాలువలు నిర్మించారు. ఈ పనులతో బాబానగర్‌, సెంథిల్‌నగర్‌, పూంపుహార్‌ నగర్‌, శ్రీనివాసనగర్‌, జయరాంనగర్‌, అనసూయనగర్‌, లక్ష్మీనగర్‌, అంజుగమ్‌ నగర్‌ తదితర ప్రాంతాలవారు లబ్ధి పొందనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని