logo

ఆరు వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు

రాష్ట్రంలో ఆరు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా. సుబ్రమణియన్‌ తెలిపారు.

Published : 05 Oct 2022 01:27 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలిస్తున్న మంత్రులు

వేలూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆరు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా. సుబ్రమణియన్‌ తెలిపారు. వేలూర్‌ జిల్లా పొన్నైలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు మా.సుబ్రమణియన్‌, దురైమురుగన్‌, జిల్లా కలెక్టరు కుమారవేల్‌ పాండియన్‌ తదితరులు పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సరిగ్గా పనిచేయలేదని తెలుసుకున్న వారు ఇద్దరు వైద్యులను బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. మేల్పాడి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలించారు. మంత్రి దురైమురుగన్‌ మాట్లాడుతూ....పొన్నై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సరిగ్గా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆసుపత్రిలో పాముకాటుకి మందులు లేవని, దీంతో రోగులు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడుక్కంపారై ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో మార్గ మద్యలోనే రోగులు మృతిచెందుతున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని పునరుద్ధరించడానికి చర్యలు చేపడతారన్నారు. అనంతరం మంత్రి మా. సుబ్రమణియన్‌ మాట్లాడుతూ....రాష్ట్రంలో మైలాడుతురై, తిరుప్పత్తూరు, రాణిపేట, కాంచీపురం, పెరంబలూరు, తెన్‌కాశిలో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేదన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts