logo

ఎయిమ్స్‌ వ్యవహారంలో కేంద్రం నాటకాలు

ఎయిమ్స్‌ నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ అన్నారు.

Published : 07 Oct 2022 00:17 IST

మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌


రేషన్‌ దుకాణాన్ని ప్రారంభిస్తున్న పళనివేల్‌ త్యాగరాజన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఎయిమ్స్‌ నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ అన్నారు. మదురైలోని సుందరరాజపురంలో రేషన్‌ దుకాణాన్ని, సుబ్రమణ్యపురంలో కౌన్సిలర్‌ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలకు ఉచితాలు ఇవ్వడం, నిధుల వనరుల గురించి సుప్రీంకోర్టు 2013లో తీర్పుకు, ఎన్నికల కమిషన్‌ లేఖకు ఒకదానికొకటి వైరుధ్యం ఉందన్నారు. ఒకే సమయంలో ప్రకటించిన రెండు ఎయిమ్స్‌ నిర్మాణాల్లో ఒకటి ప్రారంభించబోతున్నారని చెప్పారు. మరోచోట గోడ కూడా నిర్మించలేదన్నారు. ఎయిమ్స్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తీసుకొస్తున్న పథకాలకు కేంద్రం పేరు మారుస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమవేశం రాష్ట్రంలో జరుగుతుందని ప్రకటించారని, కానీ గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ క్రీడలు, క్యాసినోలను పన్ను పరిధిలోకి తీసుకురావడానికి సంబంధించిన నివేదిక సిద్ధం కానందున కౌన్సిల్‌ సమావేశాన్ని జరపలేకపోతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారని చెప్పారు. సమావేశాన్ని త్వరగా జరపాలని వారికి విన్నవించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని