logo

తమిళుల గుర్తింపు దాచలేరు

తమిళుల గుర్తింపుని కొందరు వారి అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 00:17 IST

తమిళిసై


విలేకరులతో మాట్లాడుతున్న తమిళసై

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: తమిళుల గుర్తింపుని కొందరు వారి అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కోయంబత్తూరు అవినాశిలింగం మహిళా యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె గురువారం విమానంలో కోయంబత్తూరు చేరుకున్నారు. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ... పుదుచ్చేరి వెలుగులోనే ఉందని, చీకటిలో మునిగిపోలేదన్నారు. నాలుగు గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా నిలిచిందన్నారు. కొంత మంది వల్ల కోత ఏర్పడినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారన్నారు. విద్యుత్‌బోర్డు సిబ్బంది ఆందోళన విరమించుకోవడం సంతోషకరమన్నారు. విద్యుత్తుబోర్డు ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేటుపరం చేయడం కాదన్నారు. దీని వలన సిబ్బంది, అధికారుల పదోన్నతుల్లో ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. రాజరాజచోళన్‌ గురించి డైరెక్టరు వెట్రిమారన్‌ చేసిన వ్యాఖ్యలకు కమల్‌హాసన్‌ మద్దతు తెలపడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... తమిళుల గుర్తింపును కొందరు తమ అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు. శైవం, వైష్ణవ మతాలు హిందుత్వ గుర్తింపు అని, వాటిని దాచడానికి ప్రయత్నించడం సరైనది కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని