logo

మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.

Published : 07 Oct 2022 00:17 IST

వెంకయ్యనాయుడు


వెంకయ్యనాయుడుకు పుస్తకం అందిస్తున్న సంజీవరావు

చెన్నై, న్యూస్‌టుడే: మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన్ను గురువారం రాజ్‌భవన్‌లో చెన్నపురి తెలుగు అకాడమీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రస్టు తరఫున ప్రచురించిన పలు పుస్తకాలను అందించారు. అకాడమీ మేనేజింగ్‌ ట్రస్టీ తుమాటి సంజీవరావు సహా సభ్యులతో వెంకయ్యనాయుడు సాహితీ కాలక్షేపం చేశారు. పొరుగు రాష్ట్రంలో ఉంటూ భాషాభివృద్ధికి చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తు తరాలకు మాతృభాషలు మరింత చేరువ కావాలంటే చెన్నపురి తెలుగు అకాడమీ సేవలు ప్రతి భాషవారికి ఆదర్శం కావాలన్నారు. ఈ దిశగా అన్ని భాషలవారు ముందుకు కదిలినప్పుడు ఆయా భాషలు సుసంపన్నమవుతాయని తెలిపారు. మాతృభాషపై అభిమానంతోపాటు సోదరభాషపై గౌరవాన్ని కూడా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని హితవు పలికారు. మాతృభాషను అభిమానిస్తూనే ఇతర భాషలవారి భాషాప్రేమను అర్థం చేసుకుని మసలుకోవాలని సూచించారు. మాతృభాషను కాపాడుకోవడం, ముందు తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. తూమాటి సంజీవరావు వెంట అకాడమీ సభ్యులు శివరామకృష్ణ, కేవీ దుర్గాప్రసాద్‌, దిట్టకవి అనంతపద్మనాభమూర్తి, తుమ్మపూడి కల్పన, ఎస్‌.భాస్కర్‌ ఉన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని