logo

Coconut: ఈ కొబ్బరి కాయ ధర రూ. 66 వేలు

తేని జిల్లా బోడి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయంలో స్కందషష్టి ఉత్సవాలు కొనసాగుతున్నాయి

Updated : 03 Nov 2022 07:59 IST

కొబ్బరి కాయను వేలం వేస్తున్న పూజారి

వేలచ్చేరి,న్యూస్‌టుడే: తేని జిల్లా బోడి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయంలో స్కందషష్టి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. పూజల్లో ఉంచిన వస్తువులను మంగళవారం వేలం వేశారు. కొబ్బరికాయను రూ.66 వేలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. గతేడాది రూ. 27 వేలు పలికింది. ఇంట్లో ఈ కొబ్బరికాయను ఉంచి పూజలు నిర్వహిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని