logo

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం 10 వేల శస్త్రచికిత్సలు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతిరోజు దాదాపు 10 వేల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు.

Published : 26 Nov 2022 00:24 IST

ఆరోగ్యశాఖ మంత్రి

ప్రారంభోత్సవంలో మంత్రులు మా.సుబ్రమణియన్‌, కేఎన్‌ నెహ్రూ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతిరోజు దాదాపు 10 వేల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. తిరుచ్చిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రూ.25 లక్షలతో థెరపీ పార్క్‌ను మరో మంత్రి కేఎన్‌ నెహ్రూతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా శస్త్రచికిత్సలను డిజిటల్‌ విధానంలో సరిచూసే సాంకేతికతను ఆవిష్కరించారు. 32 పడకలతో కూడిన అత్యవసర చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మా.సుబ్రమణియన్‌ మాట్లాడుతూ... శస్త్రచికిత్సలకుగాను డిజిటల్‌ సాంకేతికతను భారత్‌లోనే తొలిసారి ప్రారంభించినట్లు తెలిపారు. తిరుచ్చిలో దంత వైద్య కళాశాలను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. క్రీడాకారిణి ప్రియ మరణంపై దర్యాప్తు కమిటీ నివేదిక రాగానే బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 10వేల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రాణాలను కాపాడే వైద్యులు బాధ్యతను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సమయాల్లో తప్పు జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, ఎంపీ తిరునావుక్కరసు, కార్పొరేషన్‌ మేయర్‌ అన్బళగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు