logo

ఆధార్‌ అనుసంధానంపై దుష్ప్రచారం

విద్యుత్‌ కనెక్షన్‌కి ఆధార్‌ అనుసంధానంపై అన్నాడీఎంకే, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సెంథిల్‌ బాలాజీ తెలిపారు.

Published : 27 Nov 2022 01:19 IST

విద్యుత్‌ శాఖ మంత్రి


విలేకరులతో మాట్లాడుతున్న సెంథిల్‌ బాలాజీ

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: విద్యుత్‌ కనెక్షన్‌కి ఆధార్‌ అనుసంధానంపై అన్నాడీఎంకే, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సెంథిల్‌ బాలాజీ తెలిపారు. కోయంబత్తూరు బీళమేడులో డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 3,500 మంది లబ్ధిదారులకి ఈ సందర్భంగా సంక్షేమ సాయం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... కోయంబత్తూరులో రూ. 211 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. విమానాశ్రయ విస్తరణ పనులు 90శాతం వరకు ముగిసినట్లు పేర్కొన్నారు. మిగిలిన పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. విద్యుత్‌ కనెక్షన్‌కి ఆధార్‌ అనుసంధానం విషయమై అన్నాడీఎంకే, భాజపా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఆహ్వానిస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రావడం లేదన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్‌ ఛార్జీలను 10 శాతం తగ్గించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఛార్జీలు పెంచామని, విద్యుత్‌శాఖ రూ.1.51 లక్షల కోట్లు అప్పులో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే పెంచినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని