logo

ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోరుతూ వ్యాజ్యం

ఆలయాలకు చెందిన భూములు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 27 Nov 2022 01:19 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఆలయాలకు చెందిన భూములు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సేలానికి చెందిన వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో... పెరంబలూరు పొన్నంబల్‌ స్వామి, అయ్యనార్‌ ఆలయాల భూములు, చెరువులు ఆక్రమణలకు గురైనట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదన్నారు. ఆక్రమణల నుంచి కాపాడడానికి జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టడడానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ శనివారం ఇన్‌ఛార్జి చీఫ్‌ జస్టిస్‌ రాజా, జస్టిస్‌ కృష్ణకుమార్‌ ధర్మాసనంలో విచారణకు వచ్చింది. అప్పుడు రాష్ట్ర రెవెన్యూ శాఖ, పెరంబలూరు జిల్లా కలెక్టరు మూడు వారాల్లో దీనిపై జవాబు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని