logo

సమైక్యతను విచ్ఛిన్నం చేసిన ఆంగ్లేయులు

భారతీయుల సంస్కృతి, ఆధ్యాత్మిక సమైక్యతను ఆంగ్లేయులు విచ్ఛిన్నం చేశారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తెలిపారు. మైలాపూర్‌లోని భారతీయ విద్యా భవన్‌ ఆడిటోరియంలో జరిగిన ‘భవన్స్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌-2022’ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ రవి, ఆయన సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.

Published : 27 Nov 2022 01:19 IST

వాణీ జయరామ్‌కు పురస్కారం ప్రదానం చేస్తున్న గవర్నర్‌ రవి

చెన్నై, న్యూస్‌టుడే: భారతీయుల సంస్కృతి, ఆధ్యాత్మిక సమైక్యతను ఆంగ్లేయులు విచ్ఛిన్నం చేశారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తెలిపారు. మైలాపూర్‌లోని భారతీయ విద్యా భవన్‌ ఆడిటోరియంలో జరిగిన ‘భవన్స్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌-2022’ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ రవి, ఆయన సతీమణి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. సంగీత రంగంలో విశేష సేవలు అందించినందుకు ‘భవన్స్‌ లెజండరీ అవార్డు’ను ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్‌కు గవర్నర్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాణిజ్యం పేరిట దేశంలోకి ప్రవేశించిన ఆంగ్లేయులు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికపరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. కాశి, తమిళనాడుకు మధ్య సత్సంబంధాలనూ తెంచేశారని పేర్కొన్నారు. ఆంగ్లేయుల హయాంలో కోల్పోయిన వాటిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనితా సుమంత్‌, పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు