logo

త్వరలో అందుబాటులోకి ‘ఓఎన్‌వోసీ’

ప్రయాణికులకు సులువైన ప్రయాణం కల్పించేందుకు సీఎంఆర్‌ఎల్‌ ‘వన్‌ నేషన్‌ వన్‌ కార్డ్‌’ (ఓఎన్‌వోసీ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Published : 27 Nov 2022 01:19 IST

మెట్రో స్టేషను

వడపళని, న్యూస్‌టుడే: ప్రయాణికులకు సులువైన ప్రయాణం కల్పించేందుకు సీఎంఆర్‌ఎల్‌ ‘వన్‌ నేషన్‌ వన్‌ కార్డ్‌’ (ఓఎన్‌వోసీ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అధునాతన సాంకేతిక విధానంతో కూడిన స్మార్డ్‌ కార్డుతో బస్సు, సబర్బన్‌, పార్కింగు ఫీజులు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. చెన్నైలోనే కాకుండా ఇతర నగరాల్లో ఈ కార్డుతో ప్రయాణాలు, షాపింగు, పార్కింగులకు వీలుంటుందని మెట్రో అధికారులు పేర్కొన్నారు. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా ‘నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ (ఎన్‌సీఎంసి) మూడేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్‌సీఎంసీ ప్రయాణికులు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. కార్డు బ్యాంకుతో లింకు చేయాల్సి ఉందని, బ్యాంకులతో కొన్ని రకాల పనులున్నాయని, వాటి కోసం కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. ‘వీఎన్‌వీసీ’ కార్డు ప్రవేశపెట్టే ముందుగా సీఎంఆర్‌ఎల్‌ బృందం అన్ని రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించింది. ఆ పనులు పూర్తయ్యాక ‘నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ నుంచి (ఎన్‌పీసీఐ) సీఎంఆర్‌ఎల్‌కు ధ్రువపత్రం కూడా అందింది.  మెట్రో మొదటి దశ ఎక్స్‌టెన్షన్‌లోని వాషర్‌మెన్‌పేట నుంచి వింకోనగర్‌ వరకు ‘ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌’ (ఏఎఫ్‌సి) గేట్ల వద్ద ఎన్‌సీఎంసీ, క్యూఆర్‌ కోడ్‌ విధానంతో టిక్కెట్లు పనిచేసేందుకు సాంకేతిక మార్పులు చేయనున్నారు. కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఉన్నందుకు అదనపు గేట్ల అవసరం కూడా ఉందన్నారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించామని, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని సీఎంఆర్‌ఎల్‌ ఉన్నతాధికారి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు