logo

ఆధార్‌ అనుసంధానంపై కీలక ప్రకటన

వినియోగదారులు ఆధార్‌ నెంబరుతో విద్యుత్తు కనెక్షను అనుసంధానం చేయకపోయినా బిల్లులు చెల్లింపునకు అంగీకరించాలని టాన్‌జెడ్కో శుక్రవారం అధికారులను ఆదేశించింది.

Published : 27 Nov 2022 01:19 IST

రాణిపేట జిల్లా వాలాజాపేట సమీపం వేపూరు పంచాయతీలోని ప్రభుత్వ ఆదిద్రావిడ సంక్షేమ పాఠశాల్లో శనివారం ఓటరు నమోదు శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
భాస్కర్‌పాండియన్‌  - అరక్కోణం, న్యూస్‌టుడే

వడపళని, న్యూస్‌టుడే: వినియోగదారులు ఆధార్‌ నెంబరుతో విద్యుత్తు కనెక్షను అనుసంధానం చేయకపోయినా బిల్లులు చెల్లింపునకు అంగీకరించాలని టాన్‌జెడ్కో శుక్రవారం అధికారులను ఆదేశించింది. కొన్ని రోజులుగా ఆధార్‌ అనుసంధాన సమయంలో పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టాన్‌జెడ్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్తు బిల్లు చెల్లించే కార్యాలయాల్లో కొన్ని చోట్ల ప్రత్యేకించి కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కౌంటర్లను కూడా మూసివేయాలని ఆదేశించారు. సర్వర్‌లో సాంకేతిక సమస్యలపై ఐటీ ఇంజినీర్లతో టాన్‌జెడ్కో చర్చించింది. వెస్ట్‌ మాంబలం వాసి గుణశేఖరన్‌ మాట్లాడుతూ.. తన బిల్లు చెల్లింపునకు నవంబరు 15 చివరి గడువని, కుటుంబంతో ఊరికెళ్లడంతో సకాలంలో చెల్లించలేదని, కనెక్షను తొలగించారని పేర్కొన్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదన్నారు. బీఎంఎస్‌ ఇంజినీర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.నటరాజన్‌ మాట్లాడుతూ.. సిబ్బంది కొరత వలన అనుసంధాన ప్రక్రియను వేగంగా చేయలేకపోతున్నారని, ఇ-సేవ కేంద్రాలకు అప్పగిస్తే బాగుంటుందన్నారు. అద్దెకి ఉండే వారి ఆధార్‌ నెంబరుతో అనుసంధానం చేయడానికి అవకాశం కల్పించాలని, సదరు అద్దెదారుడు ఖాళీ చేస్తే ఆధార్‌ నెంబరును తొలగించే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు