logo

డీఎంకే ఉన్నతస్థాయి పదవులకు నియామకాలు

డీఎంకేలో ఉన్నతస్థాయి పదవులకు నియామకాలు జరిగాయి.

Published : 28 Nov 2022 01:16 IST

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకేలో ఉన్నతస్థాయి పదవులకు నియామకాలు జరిగాయి. అధిష్ఠానం విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఆర్‌.ఎస్‌.భారతి, సంయుక్త ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా అన్బగం కలై, ఉప ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే ఆస్టిన్‌, ఎమ్మెల్యే తాయగం కవి, చట్ట ప్రధాన సలహాదారునిగా ఎంపీయైన న్యాయవాది విల్సన్‌, న్యాయవిభాగం అధ్యక్షుడిగా న్యాయవాది విడుదలై, కార్యదర్శిగా న్యాయవాది ఎన్నార్‌ ఇళంగో, సంయుక్త కార్యదర్శులుగా ఎమ్మెల్యే పరంధామన్‌, కన్నదాసన్‌, మణిరాజ్‌, రవిచంద్రన్‌, దండపాణి, రాధాకృష్ణన్‌, అరుళ్‌ మొళి, ఉప కార్యదర్శులుగా పచ్చైయప్పన్‌, చంద్రు, జగన్నాథన్‌, వైద్యలింగం, దినేశ్‌, అధిష్ఠాన న్యాయవాదులుగా గణేశన్‌, సూర్య వెట్రికొండాన్‌, శరవణన్‌, కవిగణేశన్‌, జగన్‌, లివింగ్‌స్టన్‌, మరైమలై, ప్రచార విభాగం కార్యదర్శులుగా ఎంపీలు తిరుచ్చి శివ, జగద్రక్షగన్‌, దిండగల్‌ లియోని, సభాపతిమోహన్‌, సంయుక్త కార్యదర్శులుగా నెల్లికుప్పం పుగళేంది, చంద్రకుమార్‌, ఉప కార్యదర్శులుగా వేలూరు డాక్టర్‌ విజయ్‌, సుందరం, కంబం పాండియన్‌, అన్బళగన్‌, కరూర్‌ మురళీ, ఇళంపరిధి, పెరునర్కిళి, గుడియాత్తం కుమరన్‌, ఆరణి అన్బువాణన్‌, వేలూరు రమేశ్‌, సేర్కాడు కెనడి, హెడ్‌ క్వార్టర్‌ కార్యదర్శులుగా హార్బర్‌ కాజా, పూచ్చి ఎస్‌.మురుగన్‌, మాజీ ఎమ్మెల్యే సెల్వం, కార్మికుల విభాగం కార్యదర్శిగా సెల్వరాజ్‌, ఉప కార్యదర్శులుగా బాలు, రాజా కుప్పుస్వామి, కొల్లాపురం రాజేంద్రన్‌ తదితరులు నియమితులయ్యారు.

కొత్త విభాగాలు

డీఎంకేలో అసంఘటిత డ్రైవర్లు, క్రీడాభివృద్ధి విభాగాలు కొత్తగా ఏర్పాటు చేశారు. అసంఘటిత డ్రైవర్ల విభాగం అధ్యక్షుడిగా ఎంపీ కదిర్‌ ఆనంద్‌, కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సెంగుట్టువన్‌, ఉప కార్యదర్శులుగా ఎమ్మెల్యే ముత్తురాజా, పుదుకోట్టై పణపట్టి దినకరన్‌, మాజీ ఎమ్మెల్యే నాగర్‌కోవిల్‌ శివరాజ్‌, పొన్నేరి ఉదయసూరియన్‌, విష్ణు ప్రభు, క్రీడాభివృద్ధి విభాగం కార్యదర్శిగా ఎంపీ దయానిధి మారన్‌, ఉపకార్యదర్శులుగా ఎంపీలు గౌతమ శిఖామణి, పార్తిబన్‌, ఎమ్మెల్యే ఈశ్వరప్పన్‌, పైంతమిళ్‌ పారి, నంబి నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు