logo

నియామక పరీక్షకు 67 వేల మంది గైర్హాజరు

తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షకు 67 వేల మంది హాజరుకాలేదని బోర్డు ప్రకటించింది.

Published : 28 Nov 2022 01:18 IST

అన్నా వర్సిటీలో పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు

ప్యారిస్‌: తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షకు 67 వేల మంది హాజరుకాలేదని బోర్డు ప్రకటించింది. సెకండరీ గ్రేడ్‌ పోలీసు, జైలు వార్డెన్‌, అగ్నిమాపకశాఖలో 3,552 పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఆదివారం జరిగింది. 35 జిల్లాల్లో 295 కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. సుమారు 3.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులను పోలీసు అధికారులు తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతి ఇచ్చారు. ఉదయం 10కి ప్రారంభమైన పరీక్ష 12.40 గంటలకు ముగిసింది. 67 వేల మంది గైర్హారయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని