logo

తాటి విత్తనాలు నాటిన సభాపతి

పుదుచ్చేరిలో తాటి విత్తనాలు నాటే రెండో విడత పనులను సభాపతి సెల్వం ప్రారంభించారు.

Published : 28 Nov 2022 01:18 IST

విత్తనం నాటుతున్న సభాపతి సెల్వం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో తాటి విత్తనాలు నాటే రెండో విడత పనులను సభాపతి సెల్వం ప్రారంభించారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని 74వేల తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఆగస్టులో ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సభాపతి సెల్వం ప్రారంభించారు. తొలి విడతగా పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో నాటారు. తర్వాత దఫాగా నోణాంకుప్పం నది తీరం వెంబడి 2 వేల విత్తనాలు నాటడాన్ని ఆదివారం సెల్వం ప్రారంభించారు. కార్యక్రమంలో కారైకాల్‌లోని కళాశాల విద్యార్థులు, పుదుచ్చేరి రోటరీ క్లబ్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని