logo

4 వేల కిలోల బంగారం డిపాజిట్‌

రాష్ట్రంలోని ఆలయాలన పునరుద్ధరించేందుకు 4 వేల కిలోల బంగారం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.

Published : 28 Nov 2022 01:18 IST

మంత్రి శేఖర్‌బాబు

కీళ్‌పాక్కం పాతాళ పొన్నియమ్మన్‌ ఆలయంలో పనులు ప్రారంభిస్తున్న శేఖర్‌బాబు

సైదాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆలయాలన పునరుద్ధరించేందుకు 4 వేల కిలోల బంగారం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. చెన్నై మండల పరిధిలోని నాలుగు ఆలయాల్లో రూ.1.48 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. చెన్నై పెరంబూర్‌ సెంబియం లక్ష్మీ అమ్మాళ్‌, వ్యాసార్‌పాడి రవీశ్వరర్‌, కొరుక్కుపేట్టై పెరియనాయకి, కీళ్‌పాక్కం పాతాళ పొన్నియమ్మన్‌ ఆలయం తదితర ఆలయాల్లో ఈ పనులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెరియపాళైయత్తమ్మన్‌ ఆలయ నగలు స్వచ్ఛమైన బంగారంగా మార్చి 98 కిలోల బంగారు నిధిని డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. తద్వారా ఏడాదికి రూ.1.5 కోట్ల వడ్డీ వస్తుందన్నారు. అలాగే ఇరుక్కన్‌గుడి మారియమ్మన్‌ ఆలయ బంగారానికి 38 లక్షల వడ్డీ వస్తుందని పేర్కొన్నారు. ఈ మొత్తం ఆయా ఆలయాల అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. తిరువేర్కాడు, మాంగాడు అమ్మన్‌ ఆలయాల్లో ఉపయోగించేందుకు పనికిరాని ఆభరణాలను న్యాయమూర్తి ఎదుట గణించి స్వచ్ఛమైన బంగారంగా మార్చేందుకు ముంబయికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని