logo

‘ఆధార్‌’ అనుసంధాన శిబిరాలు ప్రారంభం

రాష్ట్రంలో విద్యుత్తు బిల్లు చెల్లింపునకు వినియోగదారులు ఆధార్‌ కార్డును కనెక్షన్లతో అనుసంధానం చేసే శిబిరాలను సోమవారం మంత్రి వి.సెంథిల్‌బాలాజీ ప్రారంభించారు.

Published : 29 Nov 2022 00:28 IST

ప్రక్రియను పరిశీలిస్తున్న మంత్రి సెంథిల్‌ బాలాజీ తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యుత్తు బిల్లు చెల్లింపునకు వినియోగదారులు ఆధార్‌ కార్డును కనెక్షన్లతో అనుసంధానం చేసే శిబిరాలను సోమవారం మంత్రి వి.సెంథిల్‌బాలాజీ ప్రారంభించారు. ఉదయం 10- సాయంత్రం 5.15 గంటల వరకు ఆదివారం సహా ఇవి పని చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,811 డివిజనల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. అన్ని రకాలైన సదుపాయాలు సమకూర్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 5.42 కోట్ల మంది వినియోగదారులు అనుసంధానం చేసుకున్నారు. వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ విషయంలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు