logo

మైనర్లకు మద్యం విక్రయించలేదని చెప్పగలరా?

పాఠశాల విద్యార్థులకు మద్య విక్రయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా? అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది.

Published : 29 Nov 2022 00:28 IST

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మదురై ధర్మాసనం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులకు మద్య విక్రయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా? అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం విక్రయ సమయాన్ని తగ్గించాలని, పాఠశాల విద్యార్థులకు విక్రయించడాన్ని అడ్డుకోవాలని ఇద్దరు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి సోమవారం విచారణకు వచ్చాయి. అప్పుడు ప్రభుత్వం తరఫున....దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల కంటే తమిళనాడులో తక్కువ సమయమే టాస్మాక్‌ దుకాణాలు తెరుస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు.. తక్కువ సమయం తెరిచినప్పటికీ విక్రయాలలో మొదటిస్థానంలో ఎందుకు ఉందన్నారు. మద్యం పరిమాణం తక్కువగా, ధరలు ఎక్కువగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తరఫున తెలిపారు. మధ్యాహ్నం 2 - రాత్రి 8 గంటల వరకు తెరిచే సమయం మార్చేందుకు ఎందుకు పరిశీలించకూడదని కోర్టు పేర్కొంది. పాఠశాల విద్యార్థులకు మద్యం విక్రయించడం లేదని ప్రభుత్వం చెప్పగలదా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పాఠశాల విద్యాశాఖతో చర్చించి చర్యలు చేపడతామన్నారు. అనంతరం 21 ఏళ్ల లోపువారికి మద్యం విక్రయించడాన్ని అడ్డుకోవడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి, ఈ విషయమై ప్రభుత్వానికి వచ్చిన సిఫారసుల గురించి నివేదిక దాఖలు చేయాలని ఆదేశిస్తూ డిసెంబరు ఒకటో తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని