logo

వేలూరులో సైనిక నియామక ఎంపికలు

వేలూర్‌ జిల్లా కాట్పాడిలో సైనిక నియామక ర్యాలీ నిర్వహిస్తున్నారు. పురుషుల కోసం శనివారం వరకు అవకాశం ఇచ్చారు.

Published : 29 Nov 2022 00:28 IST

పాల్గొనేందుకు వచ్చిన అభ్యర్థులు

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ జిల్లా కాట్పాడిలో సైనిక నియామక ర్యాలీ నిర్వహిస్తున్నారు. పురుషుల కోసం శనివారం వరకు అవకాశం ఇచ్చారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని తదుపరి దశలకు ఎంపిక చేశారు. మహిళలకు ఆదివారం నుంచి శిబిరం ప్రారంభమైంది. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు సాధారణ శారీరక పరీక్షలు, అనంతరం ధ్రువపత్రాల పరిశీలన కొనసాగింది. మైదానంలోకి అనుమతించారు. తరువాత పరుగు పందెం, ఇతర పరీక్షలు నిర్వహించారు. సోమవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారంతో ఎంపిక ప్రక్రియ ఇక్కడ ముగుస్తుందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని