logo

కనులపండువగా భూత వాహన సేవ

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కార్తిక మహాదీపోత్సవాలలో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం విఘ్నేశ్వరుడు, చంద్రశేఖరస్వాములకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణ, దీపారాధనలు చేశారు.

Published : 30 Nov 2022 00:59 IST

భూత వాహనంపై ఊరేగుతున్న ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కార్తిక మహాదీపోత్సవాలలో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం విఘ్నేశ్వరుడు, చంద్రశేఖరస్వాములకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణ, దీపారాధనలు చేశారు. ముందుగా మూషిక వాహనంపై వినాయకస్వామిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని భూత వాహనంపై ఊరేగించారు. సోమవారం రాత్రి పంచమూర్తులను వెండి ఇంద్ర విమానాలలో ఊరేగించారు.

* మహాదీపం వెలిగించడానికి కావలసిన నేతిని భక్తుల నుంచి సేకరించే కౌంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ కౌంటర్‌ను ఆలయ సంయుక్త కమిషనరు రాజేంద్రన్‌ ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని