logo

గవర్నర్లది వారసత్వ నియామకం కాదు: తమిళిసై

వారసత్వం ప్రాతిపదికన గవర్నర్లను నియమించడంలేదని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు.

Published : 30 Nov 2022 00:59 IST

ఓ విద్యార్థికి బహుమతి అందజేస్తున్న తమిళిసై, నమశివాయం

చెన్నై, న్యూస్‌టుడే: వారసత్వం ప్రాతిపదికన గవర్నర్లను నియమించడంలేదని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ తరఫున స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని మంగళవారం నిర్వహించారు. కాట్టేరికుప్పంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు నమశివాయం, చంద్ర ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. పలు పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో తమిళిసై మాట్లాడారు. వేర్పాటువాదాన్ని ఖండించిన సైనికుడి కుటుంబాన్ని బెదిరించడాన్ని ఆమోదించలేమని తెలిపారు. న్యాయవాదుల నియామకాల్లో తన జోక్యం లేదన్నారు. అర్హత ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసిన న్యాయవాదుల జాబితాను మాత్రం తనకు పంపారని, అందులో ఒకరు మాత్రమే చెన్నైకు చెందినవారని తెలిపారు. ముఖ్యమంత్రితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. గవర్నర్‌ పదవిని కాలం చెల్లిన పదవిగా ఎంపీ కనిమొళి విమర్శించడాన్ని ఖండించారు. అర్హత ప్రాతిపదికన మాత్రమే గవర్నర్లను ప్రభుత్వం నియమిస్తోందని, వారసత్వం ప్రాతిపదికన కాదని తెలిపారు.

*  పుదుచ్చేరిలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించడానికి దస్త్రాలు సిద్ధం చేసి గవర్నర్‌కు పంపినట్టు మంత్రి నమశివాయం తెలిపారు. అతిత్వరలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించనున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని