logo

మరో 6 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు

రాష్ట్రంలో మరో ఆరు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం వచ్చిన ఆయన పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు.

Published : 30 Nov 2022 00:59 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

విద్యార్థికి ఆఫ్రాన్‌ అందజేస్తున్న సుబ్రమణియన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో ఆరు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం వచ్చిన ఆయన పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. ఆకస్మికంగా మధ్యలోనే లిఫ్ట్‌ ఆగిపోయింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది అత్యవసర మార్గం గుండా మంత్రిని కాపాడారు. అనంతరం ఆయన ఎంసీహెచ్‌ విద్యార్థులకు ఆఫ్రాన్లు అందజేసే కార్యక్రమం, పునరుద్ధరించిన శతాబ్ది నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... స్టాన్లీ ఆస్పత్రిలో మరమ్మతుకు గురైన లిఫ్టులను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అడ్డుకుని, ఇతర రాష్ట్రాల నుంచి రవాణాను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుట్కా ఎక్కడ విక్రయిస్తున్నారో సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆరు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని