logo

మినీ బస్సు సేవల పెంపు

‘మెట్రో పాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ (ఎంటీసీ) మినీ బస్సు సేవలను రెండింతలు పెంచింది.

Published : 30 Nov 2022 00:59 IST

వడపళని, న్యూస్‌టుడే: ‘మెట్రో పాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ (ఎంటీసీ) మినీ బస్సు సేవలను రెండింతలు పెంచింది. ప్రయాణికుల డిమాండుకు తగ్గట్టుగా సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. గత ఏడాది నవంబరు వరకు నగరంలోని 30 రూట్లలో 70 పైగా మినీ బస్సులు నడిచాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 72 రూట్లలో 146 మినీ బస్సులతో సంఖ్యను పెంచింది. ఇందులో మెట్రో రైలు ప్రయాణికుల కోసం 22 సర్వీసులు, చిట్లపాక్కం, అయ్యప్పన్‌తాంగల్‌, ఆవడికి బస్సులు నడుస్తున్నాయి. కండక్టర్లు, డ్రైవర్ల కొరతతో బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టు విధానంతో సిబ్బందిని నియమిస్తామన్నారు. చిట్లపాక్కం ముత్తులక్ష్మి నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుందరరామన్‌ మాట్లాడుతూ ఎంటీసీ అధికారులకు తరచూ వినతులు సమర్పించడంతో క్రోంపేట-జ్యోతినగర్‌ వరకు ‘ఎస్‌3ఎక్స్‌’ మినీ బస్సు సర్వీసును పునఃప్రారంభించారన్నారు .* ఎస్‌ 28 అయ్యప్పన్‌తాంగల్‌-కోయంబేడు, ఎస్‌ 17 మందవెల్లి-అడయార్‌ గాంధీ నగర్‌, ఎస్‌21సి చెన్నై సెంట్రల్‌-మైలాపూరు, ఎస్‌ 47 ఆవడి-మిట్టానమల్లికి కొత్త సర్వీసులు నడుస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని