logo

త్వరలో అందుబాటులోకి పార్కింగు భవనం

నగర విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన బహుళ అంతస్తుల పార్కింగు భవనం డిసెంబరు 4వ తేదీ అందుబాటులోకి రానుంది.

Published : 30 Nov 2022 00:59 IST

ప్రారంభానికి సిద్ధమైన పార్కింగు భవనం

వడపళని, న్యూస్‌టుడే: నగర విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన బహుళ అంతస్తుల పార్కింగు భవనం డిసెంబరు 4వ తేదీ అందుబాటులోకి రానుంది. 4.25 ఎకరాల స్థలంలో రూ.250 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్లకు చేరుకునేందుకు వీలుగా కాలినడక పైవంతెనల సదుపాయం కూడా కల్పించారు. రిటైల్‌ దుకాణాలు, రెస్టారెంట్లతో పాటు 2,200 వాహనాలు పార్కింగు చేసుకునే వీలుంది. ప్రస్తుతమున్న పార్కింగు ప్రదేశంలో 1,200 కార్ల వరకు పార్కు చేసుకోవచ్చు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (బీసీఏఎస్‌), తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అన్ని రకాల అనుమతులు లభించాయని ‘ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఏఏఐ) అధికారులు పేర్కొన్నారు. వాహనాలు పార్కింగు భవంతికి వచ్చేందుకు వీలుగా రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని ఏఏఐ అధికారి ఒకరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు