logo

కుటుంబీకుల చెంతకు మానసిక దివ్యాంగురాలు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ముబినా (55) మానసిక దివ్యాంగురాలు. 20 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. తిరుప్పత్తూరు జిల్లాలోని ఓ బస్టాండు వద్ద సుమారు 12 ఏళ్ల క్రితం సంచరిస్తుండగా స్థానికులు ఆమెను ఉదవుం ఉళ్లంగల్‌ అనే అనాథ ఆశ్రమంలో చేర్చారు.

Published : 30 Nov 2022 00:59 IST

ముబినాను శాలువాతో సత్కరిస్తున్న కలెక్టరు అమర్‌ కుష్వాహా

వేలూర్‌, న్యూస్‌టుడే: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ముబినా (55) మానసిక దివ్యాంగురాలు. 20 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. తిరుప్పత్తూరు జిల్లాలోని ఓ బస్టాండు వద్ద సుమారు 12 ఏళ్ల క్రితం సంచరిస్తుండగా స్థానికులు ఆమెను ఉదవుం ఉళ్లంగల్‌ అనే అనాథ ఆశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు తగిన చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైమానిక దళ అధికారి ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆగ్రా పోలీసులకు సమచారం చేరవేశారు. వారు ముబినా కుటుంబీకుల వివరాలను సేకరించి వారికి విషయాన్ని తెలియజేశారు. వారు వెంటనే అక్కడి నుంచి తిరుప్పత్తూరుకు చేరుకున్నారు. అధికారుల సమక్షంలో అనాథాశ్రమ నిర్వాహకులు ముబినాను ఆమె కుటుంబీకులకు అప్పగించారు. కలెక్టర్‌ అమర్‌ కుష్వాహా ముబినాను సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని