logo

ప్రధాని భద్రతలో లోపం లేదు: డీజీపీ

చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చిన సమయంలో ఎలాంటి భద్రతా లోపం లేదని డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. మద్రాసు వర్సిటీలో సైబర్‌ నేరాల నియంత్రణ, అవగాహనపై సదస్సు జరిగింది.

Published : 01 Dec 2022 00:45 IST

శైలేంద్రబాబుకు జ్ఞాపికను అందజేస్తున్న ఉప కులపతి గౌరి - చెన్నై, న్యూస్‌టుడే

ప్యారిస్‌, న్యూస్‌టుడే: చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చిన సమయంలో ఎలాంటి భద్రతా లోపం లేదని డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. మద్రాసు వర్సిటీలో సైబర్‌ నేరాల నియంత్రణ, అవగాహనపై సదస్సు జరిగింది. కార్యక్రమంలో డీజీపీ శైలేంద్రబాబు ప్రత్యేక అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. వర్సిటీ ఉపకులపతి గౌరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో భద్రతా లోపం ఉన్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించిన విషయమై సమాధానమిస్తూ... ఎలాంటి భద్రతా లోపం లేదన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ ఉపయోగించే భద్రతా పరికరాలు అత్యాధునికమైనవని తెలిపారు. ఏటా వాటిని పరిశీలిస్తారన్నారు. ఉపయోగంలేని పరికరాలను వెంటనే తొలగిస్తారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం తమిళనాడు పోలీసుశాఖ నుంచి పరికరాలు అడిగి తీసుకునే పరిస్థితి ఉందన్నారు. అదేవిధంగా ఎన్‌ఐఏ అధికారులతో మంగళవారం సమావేశం జరిగిందని, కోయంబత్తూరు బాంబు పేలుడు మినహాయించి 15 కేసుల గురించి చర్చించినట్లు చెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల కార్మికుల ఆధార్‌కార్డు తదితర వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని