logo

షూటింగ్‌లో రాష్ట్ర క్రీడాకారుల సత్తా

న్యూదిల్లీలో పది రోజులుగా జరుగుతున్న 65వ జాతీయ షాట్‌గన్‌ పోటీలకుగాను ట్రాప్‌ పోటీలు ముగిశాయి.

Published : 01 Dec 2022 00:45 IST

పతకాలతో క్రీడాకారులు

సైదాపేట, న్యూస్‌టుడే: న్యూదిల్లీలో పది రోజులుగా జరుగుతున్న 65వ జాతీయ షాట్‌గన్‌ పోటీలకుగాను ట్రాప్‌ పోటీలు ముగిశాయి. ఇందులో సీనియర్‌ పురుషల విభాగంలో పుదుకోట్టై రాజ కుటుంబానికి చెందిన రాయల్‌ పుదుకోట్టై స్పోర్ట్స్‌ క్లబ్‌ కార్యదర్శి సెల్వన్‌, పృథ్విరాజ్‌ తొండైమాన్‌లు రజత పతకాలు సాధించారు. జూనియర్‌ మహిళా విభాగంలో తమిళనాడుకు చెందిన యువ క్రీడాకారిణి నిలా రాజాబాలు పసిడి పతకం సాధించారు. అదేవిధంగా నిలా, ప్రమేయ, అంతరతో కూడిన జూనియర్‌ మహిళా జట్టు కాంస్య పతకం, సీనియర్‌ మాస్టర్స్‌ విభాగంలో (60 ఏళ్లకు పైబడివారు) భక్తవత్సలం కాంస్యం, 45 నుంచి 60 ఏళ్ల లోపు విభాగం మాస్టర్స్‌ విభాగంలో డాక్టర్‌ పార్తిబన్‌ మనోహరన్‌ రజత పతకం కైవసం చేసుకున్నారు. ఇంకా భారత జట్టు ఎంపిక పోటీలకు పృథ్విరాజ్‌ తొండైమాన్‌, కేఎస్‌ సెంథిల్‌కుమార్‌, తిరునావుక్కరసు, నివేదా, నిలా, ప్రమేయలు ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని