logo

ఏనుగుకు నివాళి

పుదుచ్చేరిలోని ప్రసిద్ధ మణకుళ వినాయక ఆలయ ఏనుగు లక్ష్మి అనారోగ్యంతో బుధవారం మరణించిన విషయం తెలిసిందే.

Published : 02 Dec 2022 00:03 IST

లక్ష్మి సమాధికి నివాళులర్పిస్తున్న స్థానికులు

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలోని ప్రసిద్ధ మణకుళ వినాయక ఆలయ ఏనుగు లక్ష్మి అనారోగ్యంతో బుధవారం మరణించిన విషయం తెలిసిందే. కళేబరానికి శవపరీక్ష నిర్వహించి రాత్రి ఖననం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సమాధికి పూజలు చేసి నివాళులర్పించారు.ఏనుగుకు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు పుదుచ్చేరి పర్యాటకశాఖ మంత్రి లక్ష్మీనారాయణన్‌ తెలిపారు. సమాధి కూడా కట్టించనున్నారని పేర్కొన్నారు. దంతాన్ని మణకుళ వినాయక ఆలయంలో భద్రపరచనున్నామని వివరించారు. ఆలయానికి కొత్త ఏనుగును రప్పించే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏనుగును పెంచడానికి చట్టపరంగా పలు ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని