logo

హెచ్‌ఐటీఎస్‌లో శిక్షణ కేంద్రం

‘హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌’ (హెచ్‌ఐటీఎస్‌)లో  ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎక్స్‌పీరియంటల్‌ ట్రెయినింగ్‌ హబ్‌’ను గురువారం లాంఛనంగా ప్రారంభించింది. 

Published : 02 Dec 2022 00:02 IST

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌, గోవిందరాజన్‌

వడపళని, న్యూస్‌టుడే: ‘హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌’ (హెచ్‌ఐటీఎస్‌)లో  ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎక్స్‌పీరియంటల్‌ ట్రెయినింగ్‌ హబ్‌’ను గురువారం లాంఛనంగా ప్రారంభించింది.  ఈ హబ్‌ ద్వారా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటారు సైకిళ్ల సాంకేతికను హెచ్‌ఐటీఎస్‌ ఇంజినీరింగు విద్యార్థులు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ డీలర్లు తెలుసుకోగలరన్నారు. హెచ్‌ఐటీఎస్‌ ప్రొ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌ సమక్షంలో ఎన్‌ఫీల్డ్‌ సంస్థ సీఈవో బి.గోవిందరాజన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, సాంకేతికతపై శిక్షణ కల్పించేందుకు రెండు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. హెచ్‌ఐటీఎస్‌ ప్రాంగణంలో 11 వేల చదరపు అడుగుల స్థలంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పొన్‌ రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని