logo

ఐఐటీఎంలో ప్రాంగణ నియామకాలు

‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం)లో మొదటి విడతగా గురువారం 2022-23 ఏడాదికిగాను జరిగిన ప్రాంగణ నియామకాల్లో 445 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.

Published : 02 Dec 2022 00:04 IST

విద్యార్థులతో డైరెక్టర్‌ వి.కామకోటి తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం)లో మొదటి విడతగా గురువారం 2022-23 ఏడాదికిగాను జరిగిన ప్రాంగణ నియామకాల్లో 445 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఇందులో ముందస్తు అవకాశాలు (ప్రి ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ - పీపీఓస్‌) సాధించిన వారు కూడా ఉన్నారని, గత ఏడాది 407 మంది సాధించగలిగారని అధికారులు పేర్కొన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి 1,722 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 331 సంస్థలు ముఖాముఖి కోసం పేర్లు రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఈ సంస్థలు మొత్తం 722 మందిని నియమించుకోనున్నాయి. ప్రాంగణ నియామకాల్లో మంచి విజయాన్ని సాధించిన వారిని ఐఐటీ ఆచార్యులు, డైరెక్టర్‌ వి.కామకోటి అభినందించారు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌, గ్రావిటాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, బజాజ్‌ ఆటో, బెయిన్‌ అండ్‌ కంపెనీ, గోల్డ్‌మన్‌ సాచ్స్‌, క్వాల్‌కమ్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ వంటి ప్రముఖ సంస్థలు అవకాశాలు కల్పించాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ,  సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీడీఓటీ) సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. మొదటి విడత నియామకాలు 7వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయని కామకోటి అన్నారు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఏడాదికి రూ.కోటి వేతనంతో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి సంచిట్‌ గుప్తా నియామక పత్రం అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని