logo

అన్నాడీఎంకే నిరాహారదీక్ష

డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ అన్నాడీఎంకే నేతలు శుక్రవారం నిరాహారదీక్ష చేపట్టారు.

Published : 03 Dec 2022 00:31 IST

మాట్లాడుతున్న పళనిస్వామి

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ అన్నాడీఎంకే నేతలు శుక్రవారం నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు, పాలు వంటి పలు వస్తువులు ధరల పెరుగుదలను అరికట్టి, రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కోయంబత్తూరులో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నేతృత్వంలో కోయంబత్తూరు శివానంద కాలనీలో జరిగిన నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షను ప్రతిపక్ష నాయకులు, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభించారు. ఈ నిరాహారదీక్షలో జిల్లా ఎమ్మెల్యేలు, నిర్వాహకులు పాల్గొన్నారు. పళనిస్వామి మాట్లాడుతూ....అన్నాడీఎంకే తీసుకొచ్చిన పథకాలను అమలు చేయకుండా డీఎంకే ప్రభుత్వం వదిలేసిందన్నారు. ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చాలని ఈ నిరాహారదీక్ష చేపట్టినట్లు చెప్పారు. పదేళ్ల తమ పాలన ఉత్తమంగా ఉందని, అమ్మ మృతి తరువాత ఆమె పథకాలను అమలు చేశామని చెప్పారు. ఎంజీఆర్‌ మృతి తరువాత అమ్మ పార్టీని నడిపిందని, అలాంటి పార్టీ గురించి మాట్లాడేందుకు అర్హత ఉండాలన్నారు. కోయంబత్తూరులో చాలా పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. మెట్రో రైలు, విమానాశ్రయ విస్తరణ తమ హయాంలో చేపట్టామన్నారు. అన్నూర్‌లో పారిశ్రామిక పార్కు పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతుల భూములు తీసుకోకూడదని చెప్పారు. కోవైలో రహదారులు అధ్వానంగా మారయని ఆరోపించారు. భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని