logo

హైకోర్టులో వాదన భాషగా తమిళానికి అవకాశం

భవిష్యత్తులో మద్రాసు హైకోర్టులో వాదన భాషగా తమిళం ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు హామీ ఇచ్చారు.

Published : 03 Dec 2022 00:31 IST

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు  

విద్యార్థినికి పట్టా ప్రదానం చేస్తున్న దృశ్యం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: భవిష్యత్తులో మద్రాసు హైకోర్టులో వాదన భాషగా తమిళం ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు హామీ ఇచ్చారు. చెన్నైలోని తమిళనాడు డాక్టర్‌ అంబేెడ్కర్‌ న్యాయ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ..... ప్రజలు న్యాయశాఖను సులభంగా సంప్రదించేందుకు ప్రాంతీయ భాషల్లో విచారణ అవసరం అన్నారు. ప్రధాని మోదీ మన సంస్కృతి, భాషతో దేశాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. కోర్టు విచారణలు, న్యాయశాఖలో భవిష్యత్తులో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడానని చెప్పారు. తమిళం ఉత్తమ భాష అన్నారు. ఒక భాషను మాత్రమే బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మాట్లాడుతూ.... మోదీ వంటి బలమైన నాయకుడు ఉండడంతో దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందన్నారు. దీనిని నాశనం చేయడానికి మతం, జాతి, కులం పేరుతో గొడవలు జరగవచ్చన్నారు. మనం వాటిని ఎదుర్కొని అభివృద్ధి మార్గంలో వెళ్లాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని