logo

ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దని ఆందోళన

ఉపాధ్యాయులను బదిలీ చేయెద్దని పాఠశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వేలూర్‌ కొసప్పేట ఈవీఆర్‌ఎన్‌ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు.

Published : 03 Dec 2022 00:31 IST

ఆందోళన చేస్తున్న దృశ్యం

వేలూర్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులను బదిలీ చేయెద్దని పాఠశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వేలూర్‌ కొసప్పేట ఈవీఆర్‌ఎన్‌ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లస్‌వన్‌, ప్లస్‌టూ తరగతులకు బోధించే నలుగురు ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందాయి. తమ ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దని శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. జిల్లా విద్యాధికారులు దయాళన్‌, లక్ష్మి తదితరులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. వారి వినతిని జిల్లా ప్రాథమిక విద్యాధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని