logo

‘ఓటు విలువను గుర్తించాలి’

ప్రతి ఒక్కరూ ఓటు విలువను గుర్తించాలని పాండిచ్చేరి విశ్వవిద్యాలయ కమ్యూనిటీ కళాశాల ప్రిన్సిపల్‌ లలితా రామకృష్ణన్‌ సూచించారు.

Published : 03 Dec 2022 00:31 IST

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న లలితా రామకృష్ణ్ణన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ఓటు విలువను గుర్తించాలని పాండిచ్చేరి విశ్వవిద్యాలయ కమ్యూనిటీ కళాశాల ప్రిన్సిపల్‌ లలితా రామకృష్ణన్‌ సూచించారు. పీయూ కమ్యూనిటీ కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం జరిగింది. ప్రిన్సిపల్‌ లలితా రామకృష్ణన్‌ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైందని తెలిపారు. సరైన పాలకులను ఎన్నుకునేందుకు వజ్రాయుధం వంటిందని పేర్కొన్నారు. ఈ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పుదుచ్చేరి ఎన్నికల విభాగ అధికారి విబిన్‌, పుదువై ఓటరు నమోదు ఎన్నికల విభాగం నోడల్‌ అధికారి గోవిందస్వామి, కళాశాల ఓటరు నమోదు నోడల్‌ అధికారి డాక్టర్‌ పాండు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని