logo

‘రమ్మీ’ పాఠం తొలగింపు

ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న రమ్మీ గేమ్‌ గురించిన పాఠాన్ని తొలగిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

Updated : 03 Dec 2022 05:28 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న రమ్మీ గేమ్‌ గురించిన పాఠాన్ని తొలగిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదంపై నిషేధం బిల్లును గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో ఆరో తరగతి గణిత పాఠ్యాంశంలో రమ్మీ ఎలా ఆడతారు తదితర వివరాలతో ఉన్న పాఠాన్ని తొలగించాలని డిమాండ్లు వచ్చాయి.  ఆ పాఠాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా తొలగిస్తారని, దీన్ని ఈ ఏడాదే చేర్చారని శుక్రవారం విద్యాశాఖ వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని