logo

పైలట్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

దోహాకు బయలుదేరిన విమానంలో యాంత్రికలోపాన్ని వెంటనే గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది.

Published : 03 Dec 2022 00:31 IST

చెన్నై, న్యూస్‌టుడే: దోహాకు బయలుదేరిన విమానంలో యాంత్రికలోపాన్ని వెంటనే గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం తెల్లవారుజామున దోహాకు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం బయలుదేరింది. రన్‌వేపై ఉండగానే విమానంలో యాంత్రికలోపం ఏర్పడటాన్ని పైలట్‌ గుర్తించారు. వెంటనే ఎయిర్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం అందించి, విమానాన్ని రన్‌వేపైనే నిలిపారు. అందులోని 139 మంది ప్రయాణికులను విమానాశ్రయంలోని విశ్రాంతి గదులకు తరలించారు. విమానంలో ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని