logo

‘విద్యార్థులందరూ సమానమే’

యూనిఫాం ధరించి పాఠశాలకు వచ్చిన తరువాత విద్యార్థులందరూ సమానమేనని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి తెలిపారు

Published : 04 Dec 2022 02:02 IST

కార్యక్రమంలో పాల్గొన్న అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి తదితరులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: యూనిఫాం ధరించి పాఠశాలకు వచ్చిన తరువాత విద్యార్థులందరూ సమానమేనని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చెన్నై విరుగంబాక్కం జయగోపాల్‌ గరోడియా ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అప్పుడు బధిరులు తమిళ్‌త్తాయ్‌ వాళ్తు పాడే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తరఫున ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. దివ్యాంగులకు అన్నివిధాలా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. విద్య మాత్రమే సమానత్వాన్ని పెంచడానికి ముఖ్య ఆయుధం అన్నారు. దివ్యాంగులను కన్న తల్లిదండ్రులు భగవంతునితో సమానమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకూడదని చెప్పారు. పాఠశాలలో పొందే మార్కులు మాత్రమే వారి నైపుణ్యాన్ని లెక్కించవని, ప్రతి ఒక్కరికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని ముఖ్యమంత్రి చెబుతారని గుర్తుచేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని