logo

కనులపండువగా మహా రథోత్సవం

కార్తిక మహాదీపోత్సవంలో భాగంగా శనివారం పంచమూర్తుల రథోత్సవాలు కనుల పండువగా సాగాయి. ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని మహారథంపై ఊరేగించారు.

Published : 04 Dec 2022 02:02 IST

ప్రత్యేక అలంకరణలో వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: కార్తిక మహాదీపోత్సవంలో భాగంగా శనివారం పంచమూర్తుల రథోత్సవాలు కనుల పండువగా సాగాయి. ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని మహారథంపై ఊరేగించారు. వేకువజామున ఆలయంలో పంచమూర్తులైన వినాయకస్వామి, వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి, ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి, పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరర్‌లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ జరిగాయి. ఉదయం వృశ్చికలగ్నంలో వినాయకస్వామిని రథంలో ఉంచారు. ఆలయ సంయుక్త కమిషనర్‌ అశోక్‌కుమార్‌, పట్టణ పురపాలక సహకార బ్యాంకు అధ్యక్షుడు గుణశేఖరన్‌, పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీధరన్‌, నటుడు మయిల్‌స్వామి రథోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి మహారథోత్సవం మొదలైంది. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ట్రాఫిక్‌ మార్పులు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని