logo

లారీ ఢీకొని తెగిపడిన విద్యుత్తు తీగలు

రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద లారీ ఢీకొని రైల్వే విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. కుంభకోణం నుంచి మైలాడుదురై వెళ్లే మార్గంలో ఆడుదురై-తరంగంబాడి ప్రాంతం వద్ద రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ ఉంది.

Published : 04 Dec 2022 02:02 IST

గిండి, న్యూస్‌టుడే: రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద లారీ ఢీకొని రైల్వే విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. కుంభకోణం నుంచి మైలాడుదురై వెళ్లే మార్గంలో ఆడుదురై-తరంగంబాడి ప్రాంతం వద్ద రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ ఉంది. మనల్‌మేడు ప్రాంతానికి చెందిన కార్తీక్‌ లారీ డ్రైవరు. ఇతను లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ముందు వెళుతున్న మరో లారీని దాటి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ పైభాగం పైన ఉన్న విద్యుత్తు తీగలకు తగిలి తెగిపడ్డాయి. వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం మేరకు రైల్వే ఇంజినీరింగ్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని తీగలను సరిచేశారు. ఈ కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని