logo

కొండచిలువ పట్టివేత

పొలంలో ఉన్న 12 అడుగుల కొండ చిలువను అగ్నిమాపక సిబ్బంది పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Published : 04 Dec 2022 02:02 IST

కొండచిలువను చూపుతున్న అటవీ సిబ్బంది

సేలం, న్యూస్‌టుడే: పొలంలో ఉన్న 12 అడుగుల కొండ చిలువను అగ్నిమాపక సిబ్బంది పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సేలం ఎరుమాపాళెయం వద్ద రైతు చిన్నస్వామికి చెందిన తోటలో శనివారం పనిచేసుకుంటుండగా అక్కడ భారీ కొండచిలువ కనిపించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువను పట్టుకుని ఏర్కాడు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని