logo

Jayalalitha: తెరపైకి జయలలిత వర్ధంతి దిన సమస్య

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి దినం డిసెంబర్‌ 5న సోమవారం మెరీనాలోని జయలలిత స్మారక మందిరంలో నివాళులర్పించేందుకు ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు, శశికళ, దినకరన్‌లు సిద్ధంగా ఉన్నారు.

Updated : 05 Dec 2022 07:27 IST

సైదాపేట, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి దినం డిసెంబర్‌ 5న సోమవారం మెరీనాలోని జయలలిత స్మారక మందిరంలో నివాళులర్పించేందుకు ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు, శశికళ, దినకరన్‌లు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జయలలిత వర్ధంతి డిసెంబర్‌ 5న కాదని, ఆర్ముగస్వామి కమిషన్‌ నివేదిక ప్రకారం 4న అనే సమస్య తెరపైకి వచ్చింది. జయలలిత మృతి గురించి విచారించేందుకు ఏర్పాటు చేసిన ఆర్ముగస్వామి కమిషన్‌ ఇటీవల నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అందులో జయలలిత డిసెంబర్‌ 4న మృతి చెందినట్లు ఉంది. అయితే దీన్ని ఈపీఎస్‌, ఓపీఎస్‌లు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో జయలలిత మృతి చెందింది డిసెంబర్‌ 4న అని ప్రభుత్వాదేశంలో మార్పు చేయాలని అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం కేసీ పళనిస్వామి 100 మందికి పైగా నిర్వాహకులతో కలిసి జయలలిత స్మారక మందిరంలో నివాళులర్పించారు. జయలలిత నిజమైన వర్ధంతి డిసెంబర్‌ నాలుగవ తేదీ అని, కావునే ఈరోజు నివాళులర్పించినట్లు ఆయన తెలిపారు. ఆర్ముగస్వామి కమిషన్‌ ఏర్పాటు చేసింది ఎడప్పాడి పళనిస్వామేనని, కావున ఆర్ముగస్వామి కమిషన్‌ నివేదికను అంగీకరించాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి నిజమైన వర్ధంతి దినాన్ని పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జయలలిత వర్ధంతిని డిసెంబర్‌ 4వ తేదీగా ప్రభుత్వాదేశంలో సవరించాలని డిమాండ్‌ చేశారు. కేసీ పళనిస్వామి ఈ చర్యలు, వ్యాఖ్యలతో ప్రస్తుతం జయలలిత స్మారక దినం తేదీ గురించి కొత్త సమస్య మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని