logo

భారతియార్‌ నాటక ప్రదర్శన ప్రారంభం

రాష్ట్ర సమాచారశాఖ తరఫున ‘భారతియార్‌’ చారిత్రక నాటకాన్ని మంత్రులు ప్రారంభించారు.

Published : 09 Dec 2022 00:58 IST

తిలకిస్తున్న మంత్రులు తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర సమాచారశాఖ తరఫున ‘భారతియార్‌’ చారిత్రక నాటకాన్ని మంత్రులు ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, కవి భారతియార్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన కీర్తిని చాటేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎస్పీ క్రియేషన్స్‌ నిర్మాణంలో ఎస్పీఎస్‌ రామన్‌ బృందం ‘భారతియార్‌’ చారిత్రక నాటకాన్ని తొలి విడతగా చెన్నైలో ప్రదర్శించింది. కోట్టూర్‌పురంలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ప్రాంగణంలో మంత్రులు స్వామినాథన్‌, సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నాటకాన్ని తిలకించారు. అరసు కేబుల్‌ టీవీ ద్వారా ప్రసారం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని