logo

చెన్నైలో పోలీసు గస్తీ ముమ్మరం

తుపాను కారణంగా పోలీసులు గస్తీ ముమ్మరం చేసినట్లు చెన్నై కమిషనరు శంకర్‌ జివాల్‌ తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ..

Published : 10 Dec 2022 01:31 IST

మాట్లాడుతున్న శంకర్‌ జివాల్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తుపాను కారణంగా పోలీసులు గస్తీ ముమ్మరం చేసినట్లు చెన్నై కమిషనరు శంకర్‌ జివాల్‌ తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ..... ప్రజలకు సాయం అందించడానికి చెన్నై విభాగం తరఫున 12 జిల్లా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి బృందంలో ఈత, వరద నివారణ పనుల్లో అనుభవం ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టరు నేతృత్వంలో 10 మంది ఉన్నారని తెలిపారు. అవసరమైన అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నట్లు  వివరించారు. తుపాను కారణంగా 16 వేల మంది పోలీసులు 24 గంటలూ షిఫ్టు పద్ధతిలో భద్రతా విధులు చేపడుతున్నారని వెల్లడించారు. పోలీసు అధికారుల బృందాలతో కలిసి 1.500 మంది హోంగార్డులు రెస్క్యూ, నివారణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గస్తీ వాహనాల ద్వారా తుపాను, వర్షం గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి 044 - 23452372 నెంబరును అందుబాటులోకి తెచ్చామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని