logo

పాదయాత్ర ప్రారంభం ఏప్రిల్‌ 14న

తిరుచ్చెందూర్‌ నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఏప్రిల్‌ 14వ తేదీన పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Updated : 21 Jan 2023 05:42 IST

సమావేశంలో మాట్లాడుతున్న అన్నామలై

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తిరుచ్చెందూర్‌ నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఏప్రిల్‌ 14వ తేదీన పాదయాత్ర ప్రారంభించనున్నారు. శుక్రవారం కడలూరులో జరిగిన నేతల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. అన్నామలై వారికి పలు సూచనలు ఇచ్చారు. శాసనసభలో రాజ్యాంగ పరిధిని దాటి గవర్నర్‌కి వ్యతిరేకంగా అరాచకం జరిగిందని ఆరోపించారు. సేతు సముద్రం పథకాన్ని రామర్‌ వంతెన ప్రభావితం కాకుండా ఏర్పాటు చేయాలని, కాశీ తమిళ సంగమానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు, పుదుక్కోట్టైలో మైనార్టీ ప్రజలకు జరిగిన దారుణ అవమానానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని వంటి 9 తీర్మానాలను ఆమోదించారు. ఏప్రిల్‌ 14వ తేదీన తిరుచ్చెందూర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు అన్నామలై తెలిపారు.  
నిరాహార దీక్ష నేడు.. ప్యారిస్‌: దేవాదాయశాఖకు వ్యతిరేకంగా భాజపా తరఫున చెన్నైలో శనివారం నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ విషయమై శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో..... ప్రజల ఆధ్యాత్మిక మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. చెన్నై వళ్లువర్‌ కొట్టం వద్ద ఉదయం 10 గంటలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలో ఈ దీక్ష జరగనుందని తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు