logo

అందుబాటులోకి సామాజిక భవనం

రూ. 6.02 కోట్ల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి ఉదయనిధి సోమవారం ప్రారంభించారు.

Updated : 24 Jan 2023 06:11 IST

భవనాన్ని ప్రారంభిస్తున్న ఉదయనిధి స్టాలిన్‌

సైదాపేట, న్యూస్‌టుడే: రూ. 6.02 కోట్ల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి ఉదయనిధి సోమవారం ప్రారంభించారు. తిరువికా నగర్‌ మండలం 78వ వార్డు పరిధిలోని సచిదానందం వీధిలో ఎంపీ కనిమొళి, ఎగ్మూరు ఎమ్మెల్యే రవిచంద్రన్‌ల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో దీన్ని నిర్మించారు. మంత్రి పీకే శేఖర్‌బాబు సమక్షంలో ఉదయనిధి దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 9 జంటలకు వివాహాలు చేయించారు. గృహోపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో మేయర్‌ ప్రియ, ఎమ్మెల్యేలు పరంధామన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ ‘ఈపీఎస్‌, ఓపీఎస్‌లకు ఎక్కడికైనా వెళ్లండి, కమలాలయానికి వెళ్లొద్దని గతంలో చెప్పాను. ఇద్దరూ పోటాపోటీగా కమలాలయం వెళ్లారని’ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని