logo

పేదలు లేని రాష్ట్రాన్ని సృష్టిద్దాం: ఎడప్పాడి

ఎంజీఆర్‌, అన్నా మార్గంలో పేదలు లేని రాష్ట్రాన్ని సృష్టిద్దామని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.

Published : 24 Jan 2023 01:34 IST

మాట్లాడుతున్న పళనిస్వామి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఎంజీఆర్‌, అన్నా మార్గంలో పేదలు లేని రాష్ట్రాన్ని సృష్టిద్దామని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. తేని జిల్లా కంబంలో అన్నాడీఎంకే పార్టీ నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే రామరాజ్‌, కూడలూర్‌ నగర కార్యదర్శి అరుణ్‌కుమార్‌ ఇంట వివాహ వేడుక సోమవారం కంబంలో జరిగింది. ఇందులో పాల్గొనేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ మంత్రులు దిండుక్కల్‌ శ్రీనివాసన్‌, నత్తం విశ్వనాథన్‌, ఆర్బీ ఉదయకుమార్‌, సెల్లూర్‌రాజు, కడంబూర్‌రాజు, రాజేంద్రబాలాజీ తేనికి విచ్చేశారు. ఎడప్పాడికి మేళతాళాలతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆహ్వాన సభలో పళనిస్వామి మాట్లాడుతూ.... పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌, అమ్మ కలను నెరవేర్చేందుకు అందరూ ఏకమవుదామని చెప్పారు. తమది ప్రత్యేక దారి అన్నారు. పేదలు లేని రాష్ట్రాన్ని సృష్టించాలనే కలను నెరవేర్చాలని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కంబంలోని వివాహా వేడుకలో పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని