logo

నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

చెన్నైలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకోశ్‌ జన్మదిన వేడుకలు సోమవారం జరిగాయి.

Published : 24 Jan 2023 01:34 IST

యువగళం గోడపత్రికలతో చంద్రశేఖర్‌ తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నైలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకోశ్‌ జన్మదిన వేడుకలు సోమవారం జరిగాయి. చెన్నై విభాగ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు రామాంజనేయులు, చలపతి హాజరయ్యారు. కేక్‌ కత్తిరించి అందరికీ పంచారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తుందని రామాంజనేయులు అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలై యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. అందరి కష్టాలు తెలుసుకుని భరోసా ఇవ్వడానికే లోకేశ్‌ యాత్ర చేపట్టనున్నారని చలపతి తెలిపారు. అనంతరం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో రాష్ట్రం సర్వ నాశనం అయిందని, యువత ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాదయాత్రకు అందరూ సంఘీభాం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాజేష్‌ నారాయణ, జనార్దన్‌, మోహన్‌, వెంకటేశ్‌, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యువగళం పోస్టరును విడుదల చేశారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని