logo

భాజపాకిదే చివరి యాత్ర: బాలకృష్ణన్‌

అన్నామలై యాత్రే భాజపా ప్రభుత్వానికి చివరి యాత్రగా ఉండనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ అన్నారు.

Published : 25 Jan 2023 00:07 IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలకృష్ణన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: అన్నామలై యాత్రే భాజపా ప్రభుత్వానికి చివరి యాత్రగా ఉండనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ అన్నారు. మదురైలోని పళంగానత్తంలో మంగళవారం సీపీఎం, డీఎంకే కూటమి పార్టీల తరఫున ఎయిమ్స్‌ నిర్మాణానికి నిధులు కేటాయించి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. ఎంపీలు వెంకటేశన్‌, మాణిక్యం దాసూర్‌, నవాస్కణి, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా నిధులు కేటాయించలేదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర మోదీ ప్రభుత్వానికి చివరి యాత్రగా మారనుందని చెప్పారు. గవర్నర్‌ తీరు సరిగా లేదని విమర్శించారు. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో మదురై ఎయిమ్స్‌కు మొదటి విడత నిధులు కేటాయించాలన్నారు. సేతు సముద్ర ప్రాజెక్ట్‌ను కూడా వెంటనే నెరవేర్చాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని