logo

స్టంట్‌ మాస్టర్‌ జూడో రత్నం మృతి

తమిళ సినీరంగ సీనియర్‌ స్టంట్‌ మాస్టర్‌, సీపీఎం సభ్యుడైన జూడో రత్నం కన్నుమూశారు. ఆయన మృతికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ  సంతాపం తెలిపింది.

Published : 27 Jan 2023 00:44 IST

చెన్నై, న్యూస్‌టుడే: తమిళ సినీరంగ సీనియర్‌ స్టంట్‌ మాస్టర్‌, సీపీఎం సభ్యుడైన జూడో రత్నం కన్నుమూశారు. ఆయన మృతికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ  సంతాపం తెలిపింది. కమిటీ కార్యదర్శి బాలకృష్ణన్‌ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో... జయశంకర్‌ నటించిన ‘వల్లవన్‌ ఒరువన్‌’ చిత్రం ద్వారా స్టంట్‌ మాస్టర్‌గా జూడో రత్నం పరిచయమయ్యారని తెలిపారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తదితరుల చిత్రాల్లోనూ పనిచేశారని పేర్కొన్నారు. తమిళం, తెలుగు తదితర భాషల్లో 12 వేలకుపైగా చిత్రాల్లో పనిచేసి గిన్నిస్‌ రికార్డులో పేరు సాధించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కలైమామణి పురస్కారాన్ని పొందారని పేర్కొన్నారు. చిన్నతనంలోనే సీపీఎం సిద్ధాంతాలతో ఆకర్షితులయ్యారని తెలిపారు. ఆయన మృతి తమిళ సినీ రంగం, స్టంట్‌ మాస్టర్లు, పార్టీకి ఏర్పడిన భారీనష్టంగా తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీరంగ కళాకారులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో ప్రకటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ కూడా రత్నం మృతికి సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని