logo

కార్యకర్తపై మంత్రి దాడి

మంత్రి ఉదయనిధికి స్వాగతం పలుకుతున్న కార్యక్రమంలో కార్యకర్తపై మంత్రి కేఎన్‌ నెహ్రూ దాడిచేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 28 Jan 2023 01:05 IST

దాడి చేస్తున్న కేఎన్‌ నెహ్రూ

సేలం, న్యూస్‌టుడే: మంత్రి ఉదయనిధికి స్వాగతం పలుకుతున్న కార్యక్రమంలో కార్యకర్తపై మంత్రి కేఎన్‌ నెహ్రూ దాడిచేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సేలంలో శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ గురువారం రాత్రి రాత్రి సేలం వచ్చారు. ఆయనకు తలైవాసల్‌లో డీఎంకే తరఫున స్వాగతం పలికే కార్యక్రమం జరిగింది. మంత్రి ఉదయనిధికి కార్యకర్తలు వరుసగా శాలువా వేస్తున్నారు. ఆ సమయంలో ఓ కార్యకర్త శాలువా వేసి, మాట్లాడేందుకు యత్నించగా మంత్రి కేఎన్‌ నెహ్రూ అతనిపై దాడిచేసి పంపించేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని